పవన్ తీసిన అంబెడ్కర్ ఫోటో

హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌.అంబ్కేడర్‌ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆయనకు ట్విటర్‌ ద్వారా నివాళులర్పించారు.

‘గొప్ప నాయకుడు అంబేడ్కర్‌కు సెల్యూట్‌. జై భీం! ఆఖరి క్షణం వరకు న్యాయం కోసం, సమానత్వం కోసం పోరాడిన, నాకెంతో ఇష్టమైన నాయకులు అంబేడ్కర్‌, పెరియర్‌. ఈ ఫొటోని నేను లండన్‌లోని అంబేడ్కర్‌ హౌస్‌కి వెళ్లినప్పుడు తీశాను’ అని పవన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు షేర్‌ చేశారు. పవన్‌ కింద కూర్చుని ఆప్యాయంగా అంబేడ్కర్‌ ఫొటో వీక్షిస్తున్న దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈరోజు నుంచి పవన్‌ తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటించనున్నారు. తొలి విడత పర్యటనలో సమస్యల పరిశీలన, అధ్యయనం, వాటిని అవగాహన చేసుకోనున్నారు. రెండో విడత పర్యటనలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు.సమస్యలు పరిష్కరించని పక్షంలో మూడో విడత పోరాటానికి వేదిక కానుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top