మరో సారి వాయిదా పడిన 'సింగం-3'

సూర్య సినిమా 'ఎస్-3' డిసెంబరు 16 నుంచి 23కు వాయిదా పడటం వల్ల ఎంత గందరగోళం నెలకొందో.. ఎన్ని సినిమాల రిలీజ్ డేట్లు అటు ఇటు అయ్యాయో తెలిసిందే. అయ్యిందేదో అయ్యిందని అందరూ సర్దుకున్నారు. ఇప్పుడు మళ్లీ పిడుగు లాంటి వార్త బయటికి వచ్చింది. ఈ సినిమా డిసెంబరు 23న కూడా విడుదల కావడం అనుమానమేనట. డిసెంబరు 30కి లేదంటే మరో తేదీకి వాయిదా వేస్తారట. ఇంకా దీని గురించి అధికారిక సమాచారం బయటికి రాలేదు కానీ. వాయిదా మాత్రం పక్కా అంటున్నారు. గురువారమే దీని గురించి నిర్మాత జ్నానవేల్ రాజా అనౌన్స్మెంట్ చేసే అవకాశాలున్నాయి.

ఇంతకీ 'సింగం-3' వాయిదా పడటానికి కారణమేంటి అంటే.. తమిళంలో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికెట్ జారీ చేయడమేనట. సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చిందట. ఐతే తమిళంలో 'యు' సర్టిఫికెట్ వచ్చిన సినిమాలకు పన్ను మినహాయింపు ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో తమ సినిమాను రివైజ్డ్ కమిటీకి పంపాలని భావిస్తోందట చిత్ర బృందం. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి.. డిసెంబరు 23న సినిమా వచ్చే అవకాశాలు లేవట. ఇదే నిజమైతే.. వంగవీటి, సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాలకు భలే కలిసొస్తున్నట్లే. ఐతే తర్వాతి వారం షెడ్యూల్ అయిన సినిమాలకు మాత్రం తలనొప్పే. 30న అప్పట్లో ఒకడుండేవాడు, ఇంట్లో దెయ్యం నాకే భయం సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top