సుకుమార్ బర్త్ డే పోస్ట్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, విలక్షణ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ మధ్యలో షూటింగ్‌కి గ్యాప్ రావడంతో సినిమా అనుకున్న టైమ్‌కి విడుదల చేయలేకపోయారు.

ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనంను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే సుకుమార్ పుట్టినరోజు జనవరి 11. ఈ సందర్భంగా ప్రముఖులందరి నుండి సుకుమార్‌కి జన్మదిన శుభాకాంక్షలు అందాయి. రంగస్థలం చిత్ర టీమ్ ప్రత్యేకంగా సుకుమార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగా, ఈ సినిమాలో నటిస్తున్న సమంత, అనసూయ, ఆది పినిశెట్టి వారంతా సుకుమార్‌కి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. హీరో రామ్ చరణ్ మాత్రం సుకుమార్‌కి స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుకుమార్‌ ఒడిలో కూర్చుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రామ్ చరణ్.

ఈ ఫొటోను రామ్ చరణ్ భార్య ఉపాసన తన ట్విట్టర్‌లో పేజీలో షేర్‌ చేసి, రామ్ చరణ్ చెబుతున్నట్లుగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక రంగస్థలం చిత్రం అతి త్వరలో పూర్తవనుందని కూడా ఆమె పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన మెగాభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. సినిమా కోసం వెయిటింగ్ అంటూ రిప్లైలు ఇస్తున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top