పెద్ద నోట్లు ,జీఎస్టీ ఫై పాట పడిన శింబు

తమిళ స్టార్‌ శింబు సినిమా వివాదాలు ఎదుర్కొంటోంది. ఆయన హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘థత్రోం థూక్రోం’. ఈ చిత్రంలోని ఓ పాటను పెద్ద నోట్లరద్దును ప్రకటించి ఏడాది పూర్తైన సందర్భంగా విడుదల చేశారు. దీన్ని శింబు ఆలపించారు. ఈ పాటలో పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ విధానాన్ని విమర్శించారు. వివిధ బ్యాంకుల్లో లోన్‌లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. అలాంటి వారు పారిపోతుంటే సామాన్య ప్రజలు మాత్రం దేశంలోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని ఈ పాటలో పేర్కొన్నారు.

ఇప్పుడు ఇది కాస్త వివాదానికి దారి తీసింది. ఈ పాటపై సోషల్‌మీడియాలో కొందరు నెటిజన్లు జోక్స్‌ వేస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. భాజపా నేతలు శింబు ఇంటి ముందు ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయన ఇంటికి భద్రత ఏర్పాటు చేశారు. ఈ పాట వివాదంపై శింబు స్పందించారు. ఈ పాటను తాను రాయలేదన్నారు.

‘ఈ పాటలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు కాబట్టి పాడాలని నిర్ణయించుకున్నా. ఇందులో తప్పేమీలేదు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజలు నిజంగా అనేక కష్టాలు పడ్డారు. దాన్నే ఈ పాటలో చెప్పాం. ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మా బృందం ఈ పాటను రాయలేదు’ అని శింబు చె

ప్పారు.

ఇటీవల విడుదలైన విజయ్‌ ‘మెర్సల్‌’ చిత్రం కూడా అనేక వివాదాలు ఎదుర్కొంది. చిత్రంలో జీఎస్టీ గురించి తప్పుగా చూపించారని భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. సినిమాను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన ఓ న్యాయవాది ‘మెర్సల్‌’ను నిషేధించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ‘ఇది కేవలం సినిమా.. జీవితం కాదు’ అని న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. ‘మెర్సల్‌’ తెలుగు వెర్షన్‌ ‘అదిరింది’లో జీఎస్టీకు సంబంధించిన డైలాగ్‌ను మ్యూట్‌ చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top