ఫోటోగ్రాఫర్లపై శిల్పాశెట్టి బౌన్సర్ల పిడిగుద్దులు (వీడియో)

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి రక్షణగా ఉండే బౌన్సర్లు ఫోటోగ్రాఫర్లపై పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనపై బౌన్సర్లపై పోలీసులకు ఫోటోగ్రాఫర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...

ముంబైలోని ఓ నక్షత్ర హోటల్ నుంచి శిల్పాశెట్టి తన భర్తతో కలిసి బయటకు వస్తున్న సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్లు వారిని చుట్టుముట్టి ఫోటోలు తీసేందుకు పోటీపడ్డారు.

ఆ సమయంలో శిల్పాశెట్టి దంపతులకు రక్షణగా ఉన్న హోటల్ బౌన్సర్లు... ఫోటోగ్రాఫర్లపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top