మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న శర్వానంద్!

ఈ 2017వ సంవత్సరం యంగ్ హీరో శర్వానంద్ కు బాగా కలిసొచ్చింది. ఏడాది ఆరంభంలో విడుదలైన ఆయన చిత్రం ‘శతమానంభవతి’ ఘన విజయం సొంతం చేసుకోగా ఆ తర్వాత వచ్చిన ‘రాధ’ కూడా మంచి మార్కులే తెచ్చుకుంది. ఇలా రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న శర్వానంద్ అదే ఉత్సాహంతో ఈ సంవత్సరం మరొక చిత్రంతో ప్రేక్షకుల ముందురానున్నాడు.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘మహానుభావుడు’ షూటింగ్ దశలో ఉంది. రోమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను ఆగష్టు 24న రిలీజ్ చేసి సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో శర్వా హ్యాట్రిక్ అందుకుంటాడో లేదో చూడాలి. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్-2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ కథానాయకిగా నటిస్తోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top