సప్తగిరి l.l.b సినిమా రివ్యూ

నిర్మాణ సంస్థ‌: సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేష‌న్స్‌

న‌టీన‌టులు: స‌ప్త‌గిరి, క‌శిష్ వోరా, సాయికుమార్, ఎన్‌.శివ‌ప్ర‌సాద్‌, డా.ర‌వికిర‌ణ్ త‌దిత‌రులు

సంగీతం: బుల్గాని

ఛాయాగ్ర‌హ‌ణం: సారంగం ఎస్‌.ఆర్‌

కూర్పు: గౌతంరాజు

క‌ళ : అర్జున్‌

నిర్మాత‌: డా.ర‌వికిర‌ణ్‌

ద‌ర్శ‌క‌త్వం: చ‌ర‌ణ్ ల‌క్కాకుల‌

ప్ర‌స్తుతం తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్స్ హీరోలుగా మారి న‌టిస్తున్నారు. సునీల్ వంటివారు హీరోలుగానే ఉండిపోతుంటే, శ్రీనివాస‌రెడ్డి వంటి వారు మ‌రోవైపు హీరోలుగా చేస్తూనే క‌మెడియ‌న్స్‌గా కూడా రాణిస్తున్నారు. ఇలా క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన వారిలో స‌ప్త‌గిరి ఒక‌రు. గ‌తంలో స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ అనే రీమేక్ సినిమాలో హీరోగా న‌టించాడు. సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. దీంతో స‌ప్త‌గిరి మ‌ళ్లీ హీరోగా రాణించాల‌నే ప్ర‌య‌త్నంలో చేసిన మ‌రో ప్ర‌య‌త్న‌మే స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి. బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన జాలీ ఎల్‌.ఎల్‌.బి సినిమాకు ఇది రీమేక్‌. మ‌రి ఈ సినిమాతో స‌ప్త‌గిరి మ‌రోసారి స‌క్సెస్ అందుకున్నాడా? లేదా? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

క‌థ‌:

స‌ప్త‌గిరి (స‌ప్త‌గిరి) పుంగ‌నూరు మండ‌లంలోని ఒక చిన్న ప‌ల్లెటూరికి చెందిన రైతుబిడ్డ‌. ఎల్ ఎల్ బీ చ‌దువుకుంటాడు. ఉండూరులో ఎన్ని కేసులు వాదించినా విలువ ఉండ‌ట్లేద‌ని భావిస్తాడు. సిటీకి వెళ్లి మంచి పేరు, డ‌బ్బు తెచ్చుకుని త‌న మ‌ర‌ద‌లు చిట్టి (క‌శిష్ వోరా) ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. ఆ ప్ర‌కార‌మే సిటీకి చేరుకుని త‌న బావ (నిర్మాత ర‌వికిర‌ణ్‌) అండ చూసుకుని గ‌డుపుతుంటాడు. అలాంటి స‌మ‌యంలో అత‌నికి రాజ్ పాల్ (సాయికుమార్‌) అనే లాయ‌ర్ గురించి తెలుస్తుంది. పేరున్న రాజ్‌పాల్ వాదించిన ఓ కేసును పిల్ వేసి మ‌ర‌లా రియోప‌న్ చేయిస్తాడు స‌ప్త‌గిరి. ఆ కోర్టుకు జ‌డ్జి (శివ‌ప్ర‌సాద్‌). ఆ క్ర‌మంలో ఏమైంది? రాజ్‌పాల్ క్లైంట్ ఎవ‌రు? అత‌ను చేసిన యాక్సిడెంట్‌లో చ‌నిపోయింది ఎవ‌రు? భిక్ష‌గాళ్లా? రైతులా? సిటీలో ప‌ట్టుకున్న తొలి కేసులోనే స‌ప్త‌గిరి ఎలా వాదించాడు? అహంకారంతో ఉన్న రాజ్‌పాల్‌కి స‌ప్త‌గిరి ఎలాంటి ఝ‌ల‌క్‌లు ఇచ్చాడు? అనేది ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్స్:

- న‌టీన‌టుల ప‌నితీరు

- నేప‌థ్య సంగీతం

- సెకండాఫ్‌లో వ‌చ్చే కోర్టు సీన్‌

- సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్:

- పాట‌లు(ఏమైంది ఏమైంది పాట మిన‌హాయింపు)

- ఎంట‌ర్‌టైన్మెంట్ కు స్కోప్ లేదు

-

ఫ‌స్టాఫ్ ప్ర‌థమార్థం వీక్‌గా అనిపిస్తుంది

విశ్లేష‌ణ:

భార‌త రాజ్యాంగం దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం స‌మానంగా దక్కాల‌ని చెబుతుంది. కోర్టులు కూడా అదే రీతితో ప‌నిచేయాల‌ని కూడా సూచించింది. అదే రీతిలో స‌రైన ఆధారాలుంటే మ‌న వ్య‌వ‌స్థ‌లు కూడా ప‌నిచేస్తున్నాయి. అలాగే మ‌నం త‌రుచు మ‌నం పేప‌ర్ల‌లో రోడ్ యాక్సిడెంట్స్‌ను చూస్తుంటాం. ఆ యాక్సిడెంట్స్‌లో నిందితుల‌కు మాత్రం శిక్ష ప‌డ‌టం మ‌నం చూసుండం(ఎక్క‌డో అడ‌పా ద‌డ‌పా మిన‌హాయిస్తే). ఇలాంటి సెన్సిటివ్ పాయింట్‌ను పై రూపొందిన జాలీ ఎల్‌.ఎల్‌.బి మంచి విజ‌యం సాధించింది. దీన్ని తెలుగులో స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బిగా రీమేక్ చేశారు. టైటిల్ పాత్ర‌లో క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి న‌టించ‌డం విశేషం. ముందు కామెడీతో త‌ర్వాత సీరియ‌స్‌గా సాగే పాత్ర‌లో త‌న‌దైన రీతిలో స‌ప్త‌గిరి పాత్ర‌లో ఒదిగిపోయాడు. అలాగే సెకండాఫ్‌లో రైతుల‌కు న్యాయం చేసే విధంగా పోరాడే స‌న్నివేశాల్లో స‌ప్త‌గిరి న‌ట‌న మెప్పిస్తుంది. ముఖ్యంగా కోర్టులో ఎమోష‌న‌ల్‌గా మాట్లాడే స‌న్నివేశం బావుంది. డ్యాన్సులు ప‌రంగా స‌ప్త‌గిరి మెప్పించాడు. ఫ్లోర్ డ్యాన్సులు కూడా చ‌క్క‌గా చేశాడు. ఇక హీరోయిన్ క‌శిష్ వోరా పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. పాట‌ల‌కే ప‌రిమితం అయ్యింది. ఇక రాజ్‌పాల్ అనే లాయ‌ర్ పాత్ర‌లో సాయికుమార్ న‌ట‌న అద్వితీయం. త‌న‌దైన టైమింగ్‌తో సాయికుమార్ పాత్ర‌లో ఒదిగిపోయారు. ఇక జ‌డ్జ్ పాత్ర‌లో న‌టించిన శివ‌ప్ర‌సాద్ కూడా చాలా చ‌క్క‌గా చేశారు. ఇక మిగిలిన పాత్ర‌ల్లో న‌టించిన ర‌వికాలే, గొల్ల‌పూడి మారుతీరావు, ఎల్బీ శ్రీరాం స‌హా త‌దిత‌రులు చ‌క్క‌గా న‌టించారు. ఇక్క‌డొక విష‌యం చెప్పాలంటే..దాదాపు సినిమాలో తెలుగు న‌టీన‌టులకే ఎక్కువ ప్రాధానం ఇచ్చారు. ఇక సాంకేతికంగా చూస్తే..దర్శ‌కుడు చ‌ర‌ణ్ సినిమాలో పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఓ కోర్టు సీనులో స‌ప్త‌గిరి న‌ట‌ను, ద‌ర్శ‌కుడి టేకింగ్ ప్ల‌స్ అయ్యింది. తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు క‌థ‌లో చేసిన మార్పులు ఆడియెన్స్‌కు పెద్ద‌గా క‌నెక్ట్ లేదు. దండుపాళ్యం గ్యాంగ్ మనిషిలా స‌ప్త‌గిరి చేసే కామెడీ, ఊర్లో ప్ర‌భాస్ శ్రీను ద‌గ్గ‌ర నిజం చెప్పించే సీన్స్ ఎఫెక్టివ్‌గా లేవు. ఇక సారంగం సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్ర‌తి సీన్‌ను విజువ‌ల్‌గా చ‌క్క‌గా ప్రెజెంట్ చేశాడు. బుల్గానిన్ సాంగ్స్ ఏవీ సంద‌ర్భానుసారంగా లేవు. అయితే ప్రీ క్లైమాక్స్‌లో వ‌చ్చే ఏమైంది ఏమైంది..అనే సాంగ్, అందులో ఎమోష‌న్స్ బావున్నాయి. స‌ప్త‌గిరి సినిమాలో ఎంట‌ర్‌టైన్మెంట్ ఉంటుంది క‌దా అనుకునే ప్రేక్ష‌కుడికి ఆ రేంజ్ ఎంట‌ర్‌టైన్మెంట్ సినిమాలో క‌నిపించ‌దు. మొత్తంగా సినిమాలో సెకండాఫ్ సినిమారేంజ్‌ను పెంచేసింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top