మరిది కోసం సమంత స్పెషల్ రిక్వెస్ట్

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సమంత జంటగా నటించిన రంగస్థలం.. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. రామలక్ష్మిగా మెప్పించిన సమంతతో తాను జీవిత కాలం సినిమాలు చేయాలని ఉందని సుక్కు పొగిడేశాడంటే.. ఆమె ట్యాలెంట్ అర్ధమవుతుంది. ఇప్పుడు అక్కినేని అఖిల్ కోసం సమంత స్పెషల్ రిక్వెస్టును సుక్కు దగ్గర పోస్ట్ చేసిందంటూ వార్తలు వస్తున్నాయి.

తొలి రెండు చిత్రాలు ఫ్లాప్ కాగా.. రీసెంట్ గా వెంకీ అట్లూరితో కొత్త సినిమా స్టార్ట్ చేసిన అఖిల్ కు.. భారీ హిట్ ఇప్పించే బాధ్యతను తీసుకున్న సామ్.. సుకుమార్ ట్యాలెంట్ ను రంగస్థలం టైంలో గమనించి.. అఖిల్ తో మూవీ చేయాలని సుకుమార్ కు రికమెండ్ చేసిందన్నది వాటి సారాంశం. అయితే.. ఇందులో వాస్తవం ఎంత అంటే.. అసలు లేదనే విషయానే ఒప్పుకోవాలి. ఇదేదో రూమర్ అంతే తప్ప.. నిజం అనిపించేలా ఏ మాత్రం లేదు. కొందరు అఖిల్ పేరు వార్తల్లో నిలిచేందుకు గాను పని గట్టుకుని చేస్తన్న గాసిప్ గానే కనిపిస్తోంది. ఎందుకంటే.. సుకుమార్ కి అక్కినేని ఫ్యామిలీకి రిలేషన్స్ బాగానే ఉన్నాయి.

గతంలో అక్కినేని నాగచైతన్యతో కలిసి 100 పర్సెంట్ లవ్ మూవీ చేసి హిట్టు కూడా కొట్టాడు సుక్కు. అలాంటి సుకుమార్ తో సినిమా చేయాలని భావిస్తే.. మాట్లాడాలని అనుకుంటే స్వయంగా నాగార్జునే పిలుపు పంపితే సరిపోతుంది. ఇప్పుడు రంగస్థలంలో రామలక్ష్మిగా సమంత నటించింది కాబట్టి.. స్పెషల్ గా ఆమె రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అక్కినేని హీరోలతో సుక్కు సినిమా అంటే ఆసక్తిగానే ఉంటుంది కానీ.. ఇప్పటికైతే ఇలాంటి ప్రాజెక్టు ఏదీ ఇంకా పరిగణలో కూడా లేదు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top