"రక్త చెరిత్ర" ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు "కడప"

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఓ ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో ఆయన రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ‘రక్తచరిత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’ పేరిట ఓ వెబ్‌ సిరీస్‌ తీయబోతున్నారు. ఈ సిరీస్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలను వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు.

‘‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’ వెబ్‌ సీరీస్‌ వెనుక నా సద్బుద్ధితో కూడిన దుర్బుద్ధికరమైన ఉద్దేశం ఏమిటంటే.. నేను డిజిటల్‌ ప్రపంచంలోకి రావడానికి ఒకే ఒక్క కారణం.. వెండితెర మీద నాకు నచ్చినట్లు చెప్పనివ్వని కథల్ని ఎవరి గురించీ పట్టించుకోకుండా నాకు నచ్చినట్లు చెప్పడం కోసం. ముంబయి మాఫియా బ్యాక్‌గ్రౌండ్‌తో నేను నిర్మిస్తున్న ‘గన్స్‌ అండ్‌ థైస్‌’ సిరీస్‌ తర్వాత నేను తీస్తున్న మొట్టమొదటి తెలుగు అంతర్జాతీయ వెబ్‌ సీరీస్‌ ‘కడప’’

‘హింస, రక్తదాహం, ఆధిపత్యం, ఈగో, ఆశ, వెన్నుపోట్లు లాంటి రకరకాల మనిషి నైజాలకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఒకే ఒక ప్రాంతం స్ఫూర్తిగా ఈ టైటిల్‌ పుట్టింది. ‘రక్తచరిత్ర’ తీస్తున్నప్పటి నుంచి చాలా మంది మాజీ ఫ్యాక్షనిస్టులు, వాళ్ల బాధితులు, బంధువులు ఇలా ఎందరికో డబ్బులిచ్చి, బెదిరించి, మాటలతో మభ్యపెట్టి వాళ్ల గుండెల్లో దాచుకున్న రహస్యాలను బయటికి లాగేసిన మెటీరియల్‌ నుంచి పుట్టిందే ఈ కడప కథ.’

‘నేను ఈ సబ్జెక్ట్‌ని గతంలో రక్తచరిత్రలో డీల్‌ చేశాను కదా అని కొందరు భావించవచ్చు. కానీ అది కేవలం ఐదు శాతం మాత్రమే నిజం. రక్తచరిత్రలో అసలు నిజాలని పైపైన చూపించాను. పూర్తి నిజాలు అప్పటికి నాకూ తెలీకపోవడం వల్ల అసలైన రాయలసీమ చరిత్రను చూపించలేకపోయాను. దానికిఈ వెబ్‌సీరీస్‌లోభయాన్ని నూతిలోకి పారేసి, ఎవరేం అనుకున్నా పట్టించుకోకుండా నిజనిజాలను చూపించడానికి సైకిల్‌ చెయిన్‌ మీద ఒట్టుగా కంకణం కట్టుకున్నాను. ఈ ‘కడప’ వెబ్‌ సీరీస్‌ ట్రైలర్‌ శుక్రవారం ఉదయం 10 గంటలకు రిలీజ్‌ అవ్వబోతోంది.’ అని వర్మ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం వర్మ అక్కినేని నాగార్జునతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో వర్మ పోలీస్‌ అధికారి పాత్రలో కన్పించబోతున్నారు. ఇందులో నాగ్‌కి జోడీగా మైరా సరీన్‌ నటిస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈచిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నట్లు వర్మ ఇదివరకు వెల్లడించారు. మరోపక్క అలనాటి నటుడునందమూరి తారక రామారావు జీవితాధారంగా వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top