రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌రో వివాదాస్ప‌ద చిత్రం

సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌రో వివాదాస్ప‌ద చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఇప్ప‌టికే వెబ్‌సిరీస్ పేరిట అమ్మాయిల‌ను న‌గ్నంగా చూపించిన వ‌ర్మ.. ఈ సారి ఏకంగా పోర్న్‌స్టార్‌తోనే ఓ వీడియో రూపొందించాడు. స‌న్నీలియోన్ త‌ర్వాత మ‌రో పోర్న్‌స్టార్ మియా మ‌ల్కోవా.. వ‌ర్మ ద్వారా భార‌త తెర‌పై మెర‌వ‌నుంది. `గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌` పేరిట వ‌ర్మ ఈ వీడియోను రూపొందించాడు. ఈ విష‌యాన్ని వ‌ర్మ‌, మ‌ల్కోవా.. ఇద్ద‌రూ త‌మ త‌మ ట్విట‌ర్ ఖాతాల ద్వారా తెలియ‌జేశారు.

`సన్నీలియోన్‌తో ప‌నిచేసే అవ‌కాశం ద‌క్క‌క‌పోయిన‌ప్ప‌టికీ మీతో ప‌నిచేసే చాన్స్ వ‌చ్చింది. ఆ అనుభ‌వాన్నిమ‌ర‌వ‌లేను. నువ్వో అంద‌మైన పెయింటింగ్‌.. నేనో ఫ్రేమ్ మేక‌ర్‌` అంటూ మ‌ల్కోవాను ఉద్దేశించి వ‌ర్మ వ‌రుస ట్వీట్లు చేశాడు. `యూర‌ప్‌లో `గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌` షూటింగ్‌లో పాల్గొన్నా. స‌న్నీలియోన్ త‌ర్వాత భార‌త తెర‌పై క‌నిపించ‌నున్న పోర్న్‌స్టార్ నేనే` అంటూ మియా ట్వీట్ చేసింది. అలాగే ఈ వీడియోకు సంబంధించిన కొన్ని న‌గ్న ఫోటోల‌ను త‌న ట్విట‌ర్ ఖాతాలో పొందుప‌రిచింది. ఈ వీడియో ట్రైల‌ర్ జ‌న‌వ‌రి 16వ తేదీన విడుద‌ల కాబోతోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top