యాంకర్ ప్రదీప్ హీరోగా రంగం సిద్ధం

బుల్లితెరలో తామేంటో రుజువు చేసుకున్న వాళ్లు వెండితెర మీదా వెలిగిపోయే ప్రయత్నం చేస్తున్నారిప్పుడు. ‘జబర్దస్త్’ షోతో పాపులరైన అనసూయ.. రష్మి సినిమాల్లోనూ మంచి అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఓంకార్.. ప్రభాకర్ లాంటి వాళ్ల మెగా ఫోన్లు పట్టేయగా.. మరో మేల్ టీవీ హోస్ట్ రవి ఆల్రెడీ హీరోగా మారి ఓ సినిమాలో నటించాడు.

మరో టీవీ హోస్ట్ ప్రదీప్ మాచిరాజు కూడా హీరో కావడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అజయ్ సాయి మణికండన్ దర్శకత్వంలో ప్రదీప్ హీరోగా నటించే సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుందట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ జరుగుతోంది. ఇదొక కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. కొత్త నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు.

ప్రదీప్ ‘జులాయి’.. ‘అత్తారింటికి దారేది’.. ‘భం బోలేనాథ్’ లాంటి సినిమాల్లో నటించిన ప్రదీప్.. బుల్లితెరపై ‘గడసరి అత్త సొగసరి కోడలు’ షోతో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించాడు. ఆ తర్వాత ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను’తో అతడి దశ తిరిగిపోయింది. ఈ షోతో అతను స్టార్ టీవీ హోస్ట్ అయిపోయాడు. ఈ పాపులారిటీతోనే ఇప్పుడు హీరో అవుతున్నాడు. ఇటీవలే ‘నెక్స్ట్ నువ్వే’తో దర్శకుడైన ప్రభాకర్ కు ప్రదీప్ బంధువు కావడం విశేషం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top