మరో రీమేక్ చిత్రంలో నటించనున్న పవన్ కళ్యాణ్ !

ఇటీవల హారిక అండ్ హసీని క్రియేషన్స్ వారు బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం జాలి ఎల్ ఎల్ బి 2 చిత్ర రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబందించిన ఆసక్తి కర విషయం తెలిసింది. ఈ చిత్ర తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు.

పవనే ఈ చిత్ర రీమేక్ లో నటించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. జాలి ఎల్ ఎల్ బి 2 చిత్రం ఓ లాయర్ పాత్రకి సంబందించినది. హిందీలో ఈ చిత్రం లో అక్షయ్ కుమార్ నటించాడు. పవన్ కళ్యాణ్ సాధారణంగానే సామజిక పరమైన అంశాలపై ఆసక్తిగా ఉంటాడనే విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తవగానే జాలి ఎల్ ఎల్ బి 2 రీమేక్ ని ప్రారంభించనున్నాడు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top