పవన్ కళ్యాణ్ తన ప్లాన్ మార్చుకున్నాడు

పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు రాజకీయంగానూ చకచక అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’తో బిజీగా ఉన్న పవన్‌, మరో రెండు సినిమాలపై సంతకాలు చేసేశారు. ఏఎం రత్నం నిర్మించే ఓ చిత్రంలో పవన్‌ నటిస్తారు. మైత్రీ మూవీస్‌లో తెరకెక్కించే చిత్రానికీ ఓకే చెప్పేశారు. ‘అజ్ఞాతవాసి’ తరవాత రత్నం నిర్మించే చిత్రమే సెట్స్‌పైకి వెళ్తుందని భావించారు. ‘వేదాళం’ రీమేక్‌ ఇది. నేసన్‌ దర్శకత్వం వహిస్తారు. జనవరి నుంచి ఈ సినిమా మొదలవుతుందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు పవన్‌ ఆలోచన మారినట్టు తెలుస్తోంది. ‘వేదాళం’ కంటే ముందు... మైత్రీ మూవీస్‌ నిర్మించే చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. సంతోష్‌ చెప్పిన కథ పవన్‌కి బాగా నచ్చిందని, ఈ దశలో రీమేక్‌ కంటే స్ట్రయిట్‌ సినిమాలు తీయడం మంచిదని భావించిన పవన్‌... ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై పవన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top