ఆర్జీవీతో సినిమా అటకెక్కేసినట్లే

ఏ ముహూర్తాన యాక్టర్ శ్రీరెడ్డి ఇష్యూలో రామ్ గోపాల్ వర్మ ఇన్వాల్వ్ అయ్యారో కానీ అప్పటి నుంచి టాలీవుడ్ లో అగ్గి రాజేసినట్టయింది. పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి తిట్టడం వెనుక ఉన్నది ఆర్జీవీ అని తెలిసి మెగా ఫ్యాన్స్ మొత్తం ఆయన పేరెత్తితే మండిపోతున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఆర్జీవీపై యుద్ధం చేసేంత ఊపులో ఉన్నారు.

ఆర్జీవీ చేసిన ఈ పనితో టాలీవుడ్ లో ఇంకో ఫ్యామిలీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అక్కినేని నాగార్జున ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఆపీసర్ సినిమా చేస్తున్నాడు. ఇది మేలో విడుదల కావాల్సి ఉంది. దీని తరవాత అఖిల్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఇప్పటి పరిస్థితులను బట్టి అఖిల్ - ఆర్జీవీల సినిమా ఉండదని తెలుస్తోంది. అఖిల్ కెరీర్ ను నాగ్ ఆచితూచి జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇలాంటప్పుడు ఇంత పెద్ద వివాదంలో ఇరుక్కున్న డైరెక్టర్ తో సినిమా చేయడం అఖిల్ కెరీర్ కు ఏమంత మంచిది కాదని నాగార్జున ఫీలవుతున్నాడని.. అందుకే ఈ ప్రాజెక్టు పక్కన పెట్టేయడానికి ఫిక్సయ్యాడని తెలుస్తోంది.

అఖిల్ ఆర్జీవీతో పాటు తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పట్లో ఆర్జీవీ సినిమా ఉండదు కాబట్టి వెంటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశముంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top