'పవన్ నాకు దేవుడితో సమానం'

పవర్‎స్టార్ పవన్ కల్యాణ్‎కు అభిమాన వర్గంలో కేవలం ప్రేక్షకులే కాదు.. సినీ ఇండస్ట్రీలోని పలువురు హీరోలు, నటులు సైతం ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు బండ్ల గణేష్. ఈయనకు పవన్ అంటే ఎనలేని అభిమానం. గతంలో కొన్ని ఈవెంట్స్‌లో ఈయన.. 'పవన్ నాకు దేవుడితో సమానం' అని కూడా చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఇంతలా ఎన్నోసార్లు పవన్‎పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న ఈయన తాజాగా మరోసారి పవన్ గురించి ఓ ఆసక్తికరమైన ట్వీట్ పెట్టాడు.

కేవలం ఒకే పదాన్ని ఉపయోగించి పవన్ కల్యాణ్ అంటే తనకున్న అభిమానం అంతులేనిదని చెప్పకనే చెప్పాడు బండ్ల గణేష్. 'ఐ రెస్‌పెక్ట్ మై బాస్' (నా బాస్ అంటే నాకు అమితమైన గౌరవం) అని ట్వీట్ చేస్తూ.. ఆయనకు హృదయ పూర్వకంగా నమస్కారం చేస్తున్నట్లుగా ఎమోజీని పోస్ట్ చేశాడు. దీంతో పాటు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'తీన్‌మార్' సినిమాలోని పవన్ స్టిల్ కూడా పోస్ట్ చేశాడు. 'అజ్ఞాతవాసి' సినిమాకు మిశ్రమ టాక్ రావడంతో కాస్త నిరాశ చెందిన పవన్ అభిమాన వర్గం బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ చూసి ఆనందపడుతున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top