మెగా హీరోలంతా కాసి బాట పట్టారు

భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటైన కాశీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు అదృష్టరేఖగా మారిపోయింది. తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి కాశీ బాట పట్టాడు. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ 'ఇంద్ర'.. మేజర్ ఎపిసోడ్ చిత్రీకరణ అంతా వారణాసిలోనే జరిగింది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు.. 'భం భం భోలే శంఖం మోగేలే' సాంగ్ లో.. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీని అద్భుతంగా చూపించారు.

చిరంజీవి కాశీ సెంటిమెంట్‌ను ఆయన తనయుడు రామ్‌చరణ్ కూడా ఫాలో అయ్యాడు. వినాయక్ దర్శకత్వంలో చరణ్ డ్యూయెల్ రోల్‌లో మెప్పించిన 'నాయక్' చిత్రంలో కాశీ లోని కుంభమేళాను చూపించారు. ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలచింది. ఇక తండ్రీ కొడుకులు చిరంజీవి-చరణ్ కు అచ్చొచ్చిన కాశీ సెంటిమెంట్ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు మాత్రం కలసిరాలేదు. పవన్ 'తీన్‌మార్' సినిమాలోని అర్జున్ పాల్వాయ్ పాత్ర మొత్తం కాశీ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. కానీ ఈ హిందీ రీమేక్ మూవీ పవన్‌కు హిట్‌ను అందివ్వలేకపోయింది.

తాజాగా పవన్‌కళ్యాణ్ 'అఙ్ఞాతవాసి' కోసం మరోసారి కాశీ బాట పట్టాడు. ఇటీవలే యూరప్‌లో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వారణాసిలోనూ చిత్రీకరణ జరుపుకుంది. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటికే వరుసగా రెండు హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న పవర్‌స్టార్.. 'అఙ్ఞాతవాసి'తో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top