‘అజ్ఞాత‌వాసి’పై క‌త్తి రివ్యూ!

సినీ విమ‌ర్శ‌కుడు, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల శ‌త్రువు క‌త్తి మ‌హేష్ ‘అజ్ఞాత‌వాసి’ సినిమాపై స్పందించాడు. విడుదలైన కొన్ని గంట‌ల్లోనే త‌న రివ్యూను ప్ర‌క‌టించాడు. సినిమా చాలా దారుణంగా ఉంద‌ని అభిప్రాయం వెలిబుచ్చాడు. ఈ సినిమాకు కేవ‌లం 2/5 రేటింగ్ మాత్ర‌మే ఇచ్చాడు. ఈ నెల 15 వ‌ర‌కు సైలెంట్‌గా ఉంటాన‌ని క‌త్తి మహేష్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ రివ్యూ రైట‌ర్‌గా `అజ్ఞాత‌వాసి`పై త‌న స్పంద‌న‌ను ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

`సీరియ‌స్ క‌థ‌కు కామెడీతో చికాకు పెట్టి అప‌హాస్యం చేసిన సినిమా `అజ్ఞాత‌వాసి`. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కెరీర్‌లో అత్యంత దారుణ‌మైన సినిమా. రిస్క్ చేసి చూస్తే.. టైమేమో.. మీ ఇష్టం.. (ఈ సినిమా పాట ట్యూన్‌లో)` అంటూ క‌త్తి మ‌హేష్ రివ్యూ ఇచ్చాడు. మ‌రి, ఈ రివ్యూ చూశాక ప‌వ‌న్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top