బాహుబలి2 విడుదల ఆపితే అది వారికే నష్టం

బాహుబలి 2 విడుదలకు అడ్డంకులు సృష్టించకండి అని రాజమౌళి స్వయంగా కన్నడలో చెప్పిన వీడియో మెసేజ్ ఎంత మాత్రం ఫలితం ఇవ్వలేదు. పైగా ఓ కన్నడ సంఘానికి చెందిన నాయకుడు ఒకరు సాక్షాత్తు ఆ బ్రహ్మ దిగివచ్చి కన్నడ నేర్చుకుని విజ్ఞప్తి చేసినా తాము అంగీకరించమని స్వయంగా సత్యరాజ్ వచ్చి సారీ చెప్తే తమలో తాము డిస్కస్ చేసుకుని అప్పుడు విడుదలకు మార్గం సుగమం చేస్తామని స్పష్టం చేయటం చూస్తే ఇది ఇంకాస్త ముదిరేలా ఉంది.

కన్నడ హక్కులు మొత్తం రాజమౌళి ఆత్మీయుడు, వారాహి అధినేత సాయి కొర్రపాటి దగ్గర ఉన్నాయి. ఆయన అమ్ముదామన్నా అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కొనే సాహసం చేయటం లేదు. పైగా విడుదల రోజునే బంద్ కు పిలుపు ఇవ్వడంతో ఇది ఇంకా వివాదాస్పదం కానుంది. ఆర్కా మీడియా తరఫున ఎన్ని ప్రయత్నాలు చేసి కన్నడ సినిమా పెద్దలను కలిసినా కూడా ఉపయోగం ఉండటం లేదు. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం వీడియో ని ఇప్పుడు పనిగట్టుకుని వైరల్ చేసి సినిమా రిలీజ్ ని అడ్డుకోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

ఫస్ట్ పార్ట్ లో చిన్న పాత్ర పోషించడమే కాక తన ఈగ సినిమాలో విలన్ గా కూడా నటించిన కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ని మధ్యవర్తిత్వం కోసం రాజమౌళి సంప్రదించాడు అని టాక్. కాని సుదీప్ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే మద్దతుగా ఒక్క మాట మాట్లాడినా అది తిరిగి తన మెడకు చుట్టుకుంటుంది అని సుదీప్ కు సైతం తెలుసు. ఇక తెలుగు సినిమాలు వేసుకోవడం ద్వారానే ఇన్ని రోజులు పబ్బం గడుపుకున్న పంపిణిదారులు, థియేటర్ ఓనర్లు మాత్రం దీని పట్ల అసహనంగా ఉన్నారు.

కేవలం ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉందని. బాహుబలి 2 కన్నా ముందు సత్య రాజ్ సినిమాలు 30 పైగా విడుదల అయితే అప్పుడు మౌనంగా ఉండి ఎంతో కీలకమైన ఈ సినిమా టైం లోనే ఇలా చేయటం ఎందరో కడుపు కొట్టడమేనని అంటున్నారు. బెంగుళూరు, రైచూర్, బళ్ళారి, హుబ్లీ, హోస్పేట్, బీదర్, కొప్పల్, షిమోగా, బెల్గాం లాంటి ప్రధాన కర్ణాటక నగరాల్లో థియేటర్లకు అధిక రెవిన్యూ ఇచ్చేది తెలుగు సినిమానే. అలాంటిది ఇప్పుడు తెలుగు సినిమా మీద ఇలా కక్ష కడితే రేపు తెలుగు సినిమాలు ఇవ్వము పొమ్మంటే భోరున ఏడ్చే పరిస్థితి అక్కడి ఎగ్జిబిటర్లకు వస్తుంది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి బాహుబలి 2 కి రూట్ క్లియర్ చేసుకుంటే వాళ్ళకే మంచిది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top