ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్న ‘జై లవకుశ’

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పది రోజుల ముందుగానే దసరా సందడిని తీసుకొచ్చిన ‘జై లవకుశ’కు అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బ్రహ్మండమైన ఆదరణ పొందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన ఈ సినిమా.. అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుండడంతో ప్రేక్షకులతో ధియేటర్స్ నిండిపోతున్నాయి. హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ టార్గెట్‌గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో ‘జై లవకుశ’ సినిమా బాక్సాఫీస్ బొనాంజాగా మారింది.

మొదటిరోజు రికార్డ్‌ స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ సినిమా వీకెండ్స్‌లో కూడా అదే దూకుడును కొనసాగిస్తోంది. గురువారం విడుదలై కేవలం మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో అక్షరాల రూ. 75 కోట్ల రూపాయలను వసూల్ చేసింది. ఇదిలావుండగా ఈ సినిమాతో ఎన్టీఆర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల హీరోగా మారిపోయాడు. వరుసగా నాలుగు సినిమాలు 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకున్నాయి. తాజాగా విడుదలైన జై లవకుశ ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటికే మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరింది. యూఎస్‌లో ఒక్క శనివారమే 2 లక్షల 45 వేల డాలర్లు వసూలు చేసింది. ఇంకా సమాచారం అందాల్సి ఉంది. బుధ, గురు, శుక్ర, శని వారాల్లో మొత్తం కలిపి 1.2 మిలియన్ డాలర్లపైగా వసూలు చేసిందని సమాచారం. ఇదిలావుండగా ఆదివారం సెలవుదినం కావడంతో అదేస్థాయి దూకుడును కొనసాగించవచ్చునని సినీ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top