శృంగారంపై అనుష్క సెక్సీ కామెంట్స్

బాలీవుడ్‌లో కింగ్ ఆఫ్ రొమాన్స్ భావించే షారుక్ ఖాన్‌కు ఓ బ్యూటీ షాకిచ్చింది. సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ బాలీవుడ్ బాద్షాకు దిమ్మతిరిగేలా చేసింది. అలా చేసిన హీరోయిన్ ఎవరో కాదు.. హిందీ చిత్ర పరిశ్రమలో హిట్ల మీద హిట్ల కొడుతున్న ముద్దుగుమ్మ అనుష్క శర్మ. అనుష్క శర్మ అలా బోల్డ్‌గా మాట్లాడిన మాటలు ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందిస్తున్న జబ్ హ్యారీ మెట్ సెజల్ ట్రయలర్‌లోనివి. ఈ ట్రైలర్‌లో సెక్స్ గురించి బోల్డుగా మాట్లాడుతూ యువతకు అనుష్క మతిపోగొట్టే అంశాలు, మసాలా చాలానే ఉన్నాయి. ఈ చిత్రంలో లీగల్ కన్సల్టెంట్‌గా నటిస్తున్నట్టు కనిపిస్తున్నది.

ట్రైలర్‌లోని సన్నివేశంలో అనుష్క పొట్టి దుస్తులతో హాట్‌హాట్‌గా కనిపించింది. పొట్టి షార్ట్ వేసుకొని ఐటెం బాంబులా కనిపించింది. ట్రైలర్‌ను చూస్తే ఓ హోటల్‌లో హ్యారీ (షారుక్)తో సెజల్ (అనుష్క) ఉన్నట్టు కనిపిస్తున్నది. శృంగారం చేయడానికి షారుక్‌ను అనుష్క రెచ్చగొట్టినట్టు కనిపిస్తున్నది. ఇంతకీ షారుక్‌ను పూర్తిస్థాయిలో రెచ్చగొట్టింది ఎలా అంటే..

మన మధ్యలో శృంగారం పూర్తి స్థాయిలో జరిగినా.. జరుగకపోయినా అందుకు మొత్తం చార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అందులో ఏమి మినహాయింపులు ఏమీ ఉండవు అని అనుష్క స్పష్టం చేసింది. జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రంలో షారుక్ పంజాబీ యువకుడిగా, అనుష్క గుజరాతీ యువతిగా నటిస్తున్నది. టైలర్ రిలీజ్‌ను పురస్కరించుకొని అనుష్క ట్వీట్ చేసింది. నేను ఎల్ఎల్బీ చదివాను. ఫ్యామిలీ మ్యాటర్ చాలా చక్కగా హ్యండిల్ చేస్తాను. నేను నిన్ను కూడా హ్యండిల్ చేస్తాను అని అనుష్క ట్వీట్‌లో పేర్కొన్నది.

ఈ ట్రైలర్‌ను ఆదివారం ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను ట్యూబ్‌లైట్ చిత్రంతోపాటు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్ చిత్రం రంజాన్‌ను పురస్కరంచుకొని జూన్ 23న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా రూపొందుతున్న జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి మై బనీ తేరీ రాధా అనే పాట త్వరలనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అనుష్క, షారుక్ కెమిస్ట్రీ రబ్ దే బనా దే జోడి, జబ్ తక్ హై జాన్ చిత్రాలను మించి ఉంటుంది అనే అభిప్రాయం ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతున్నది. చిప్ ట్రిక్కులను ప్రదర్శించిన షారుక్‌కు అనుష్క షాక్ ఇచ్చినట్టు కనిపిస్తున్నది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top