ఎంబీఏ చేస్తూనే సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించా

తెలుగు చిత్రసీమలో హాస్యనటుడిగా మంచి గుర్తింపు పొందాలన్నదే తన లక్ష్యమని వర్ధమాన హాస్యనటుడు ఆచంట మహేష్‌ అన్నారు. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు పెదపట్నంలంక వచ్చిన ఆయన మంగళవారం స్థానిక విలేఖరులతో కొద్దిసేపు ముచ్చటించారు. ప్రస్తుతం తాను రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న రంగస్థలం, సాయిధరమ్‌తేజ్‌ చిత్రంతో పాటు హీరో అల్లు శిరీష్‌ ఒక్కక్షణం తదితర చిత్రాల్లో నటిస్తున్నాని తెలియజేశారు.

మలికిపురం మండలం శంకరగుప్తం తన స్వగ్రామమని, మలికిపురంలో ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఎంబీఏ చదివానని తెలియజేశారు. చిన్నప్పటినుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎంబీఏ చేస్తూనే సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించానన్నరు. ఆ ప్రయత్నంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పటివరకు 65 సినిమాల్లో నటించానని, 80కు పైగా టీవీ ఎపిసోడ్స్‌లో నటించానని తెలిపారు. ఖైదీ నెంబర్‌-150, శతమానంభవతి, సుప్రీం, ఉన్నది ఒకటే జిందగీ తదితర చిత్రాలు తనకు గుర్తింపు తీసుకువచ్చాయన్నారు. చిన్నాన్న బోనం అంజి, సోదరుడు రేకపల్లి బాబి తనను ఎంతో ప్రోత్సహించారని, వారి ప్రోత్సాహంతోనే తాను సినీరంగంలో ప్రవేశించినట్టుగా తెలిపారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top