‘బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌’కి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు దర్శకధీరుడు రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి ఆయనకు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

* ‘రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు’- అనుష్క
* ‘భారతీయ సినిమాకు గర్వకారణమైన రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు’- షాలిని పాండే(అర్జున్‌ రెడ్డి ఫేం)
* ‘మా దర్శకుడు రాజమౌళికి హ్యాపీ బర్త్‌డే. మున్ముందు మీరు మరిన్ని విజయవంతమైన సినిమాలు చేయాలని ఆశిస్తున్నాం’- బాహుబలి చిత్రబృందం
* ‘మాస్టర్‌ రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు’- గోపీచంద్‌ మలినేని
* ‘రాజమౌళి సర్‌కి హ్యాపీ బర్త్‌డే’- వెన్నెల కిశోర్‌
* ‘దర్శక బాహుబలి రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు’- పరుచూరిగోపాలకృష్ణ
* రాజమౌళికి హ్యాపీ బర్త్‌డే’- సుకుమార్‌
* ‘ట్రెండ్‌సెట్టర్‌, స్టోరీ టెల్లర్‌.. హ్యాపీ బర్త్‌డే రాజమౌళి జీ’- తరణ్‌ఆదర్శ్‌
* ‘హ్యాపీ బర్త్‌డే రాజమౌళి గారు’- నాని
* ‘జ్ఞానం, నాయకత్వానికి ఉదాహరణ అయిన రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’- రమ్యకృష్ణ
* ‘పద్మశ్రీ రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు’- బండ్ల గణేశ్‌
* ‘తెలుగు చిత్ర పరిశ్రమ మరచిపోలేని ఈతిహాస చిత్రాలు తెరకెక్కించే లెజెండ్‌ రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు’- ఉత్తేజ్‌

ఇక అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రకరకాల ఫొటోలు, పోస్టర్లను డిజైన్‌ చేస్తూ విషెస్‌ తెలియజేస్తున్నారు. ‘బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘బాహుబలి 2’ సినిమా తర్వాత రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్ట్‌ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఆయన మహాభారతం తీసే అవకాశాలుఉన్నాయని గతంలో వార్తలు వెలువడ్డాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోరాజమౌళి దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనకు మహాభారతం తీయాలన్న ఆలోచన ఉంది కానీ ఇది ఇప్పట్లో జరిగే పని కాదని స్పష్టం చేశారు.త్వరలో రాజమౌళి, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో సినిమా కూడా రాబోతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top