గౌతమ్ నంద.. మరీ 30 కోట్లా?

ఒక ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్.. ఒక స్టైలిష్ టీజర్ సినిమాకు ఎంత మేలు చేస్తాయో చెప్పడానికి ‘గౌతమ్ నంద’ను ఉదాహరణగా చెప్పొచ్చు. మామూలుగా చూస్తే హీరో గోపీచంద్ కెరీర్ ఏమంత గొప్పగా లేదు. చివరగా అతడి నుంచి వచ్చిన ‘సౌఖ్యం’ డిజాస్టర్ అయింది. ఈ మధ్యే విడుదల కావాల్సిన ‘ఆరడుగుల బుల్లెట్’ వాయిదా పడిపోయింది. మరోవైపు ‘ఆక్సిజన్’ సినిమాకు కూడా మోక్షం రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ‘గౌతమ్ నంద’కు అదిరిపోయే బిజినెస్ ఆఫర్లు వస్తుండటం విశేషమే. అన్ని ఏరియాల్లోనూ క్రేజీ బిజినెస్ ఆఫర్లు తెచ్చుకుంటోందట ఈ సినిమా. రూ.30 కోట్లకు పైగా ఈ చిత్రానికి బిజినెస్ అవుతున్నట్లు సమాచారం.

నైజాం ఏరియాలో ‘గౌతమ్ నంద’ను అగ్ర నిర్మాత - డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రూ.6.3 కోట్లకు సొంతం చేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. దిల్ రాజు ఈ సినిమా హక్కులు తీసుకోవడం ఒకెత్తయితే.. అంత రేటు పెట్టడం మరో ఎత్తు. దిల్ రాజు నమ్మకం పెట్టాడంటే సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఏర్పడింది. అందుకే ఈ సినిమా శాటిలైట్ హక్కులు కూడా అనూహ్యమైన రేటు పలికినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ‘గౌతమ్ నంద’ శాటిలైట్ హక్కుల్ని రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర సీడెడ్ హక్కులు రూ.4 కోట్లు పలికాయట. ఓవర్సీస్ రైట్స్ రూ.1.5 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం. ఇవన్నీ గోపీచంద్ కెరీర్లో రికార్డు రేట్లని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవరాల్ బిజినెస్ పరంగా కూడా గోపీచంద్ కు ‘గౌతమ్ నంద’ నంబర్ వన్ సినిమానే. ఎంత ఫస్ట్ లుక్.. టీజర్ స్టైలిష్ గా.. ఇంట్రెస్టింగ్ గా అనిపించినా.. మరీ ఇంతేసి రేట్లు పెడుతున్న బయ్యర్లు సేఫ్ అవుతారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top