చిరంజీవి అభిమానులకి శుభవార్త

అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఇవాళ ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. మెగాస్టార్‌ చిరంజీవికి ఇది 151వ చిత్రం కాగా.. రామ్ చరణ్‌కు నిర్మాతగా రెండవ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మొదటి షాట్ మెగాస్టార్, పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీలపై తీశారు. మరికొందరు ఆర్టిస్టులు ఉన్నప్పటికీ ముఖ్యంగా మొదటి షాట్‌లో వీరిద్దరే కీలకం. ఇటీవల సైరా సినిమాలో ఛాన్స్ బ్రహ్మాజీ ఛాన్స్ కొట్టేసినట్టు సడెన్‌గా వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో బ్రహ్మాజీ పాత్ర నిడివి తక్కువే అయినా ఇది సినిమాకు కీలకమని సమాచారం. బ్రహ్మాజీ ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఈ సినిమా మాత్రం తన కెరీర్‌కి కీలకం కాబోతోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top