బాలయ్యతో పోటీకి శర్వా సిద్ధం

ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇచ్చాడు శర్వానంద్. మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పుడుతంటే.. తను కూడా మధ్యలో నిలిచాడు. ఈ కాంపిటీషన్ లో శర్వా శతమానం భవతి నలిగిపోతుందని అంతా అనుకున్నారు కానీ.. పెట్టుబడితో పోల్చితే.. ఇదే పెద్ద హిట్ గా నిలిచిన విషయాన్ని మరచిపోకూడదు.

అప్పుడు చిరు- బాలయ్యలకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన శర్వానంద్.. మరోసారి బాలయ్యతో తలపడబోతున్నాడు. శర్వానంద్ కొత్త సినిమా రాధా రిలీజ్ కి రెడీగా ఉంటే.. బాలయ్య ఓ వారం క్రితం కొబ్బరికాయ కొట్టారు. మరి పోటీ ఎలా సాధ్యం అనే డౌట్ సహజమే కానీ.. ఈసారి శర్వా పోటీ ఇవ్వనున్నది సిల్వర్ స్క్రీన్ పై కాదు. బుల్లితెరపై టఫ్ కాంపిటీషన్ కి ప్రిపేర్ అయిపోయాడు శర్వానంద్.

ఉగాది పండుగ సందర్భంగా ఓ ఛానల్ 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ప్రదర్శించనుండగా.. మరో ఛానల్ లో 'శతమానం భవతి'ని షెడ్యూల్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నాని నటించిన జెంటిల్మన్ ను కూడా అదే రోజు బుల్లితెరపై పోటీ పడనుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top