నరసింహ రెడ్డి ల మారిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘సై రా నరసింహారెడ్డి’ అనే టైటిల్‌తో తెరకెక్కబోతోన్న ఈ సినిమా గురించి రకరకాలు వార్తలు హల్‌చల్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రారంభం కావలసిన ఈ సినిమా, చరిత్ర ప్రధానాంశంతో తెరకెక్కనుండడం వల్ల ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయంతో ఆలస్యమవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మెయిన్ ఈ సినిమాకి చిరంజీవే కావడంతో తన నుంచి ఎటువంటి రీమార్క్ ఉండకూడదని చాలా కేర్ తీసుకుంటున్నారు చిరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించబోతోన్న సైరా సినిమా కోసం చిరు ఫిటెనెస్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రామ్ చరణ్ కూడా తండ్రితో పాటు జిమ్‌లో పాల్గొంటూ చిరుకి సహాయం చేస్తున్నట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి

.

డిసెంబర్ 6 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని స్టార్ట్ చేయడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే రెడీగా ఉన్నారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక సెట్‌లో సినిమా మొదటి షూట్ జరుగనుంది. నిర్మాత రామ్ చరణ్ దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కోసం మెగాస్టార్ చాలా కష్టపడుతున్నారు. రీసెంట్‌గా దర్శనమిస్తున్న ఈ ఫొటోని చూస్తుంటే చిరు ఎంత కష్టపడుతున్నారో అర్ధం అవుతుంది. ఆరు పదుల వయసు దాటినా కూడా చేయబోతుంది యోధుడి పాత్ర కావడంతో.. ఆ లుక్ కోసం యోధుడిలా కష్టపడుతున్నారు చిరంజీవి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు సరిపడ బాడీ షేప్‌ను చిరు ఇప్పటికే పొందినట్లుగా ఈ ఫొటో చెప్పేస్తోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top