"అజ్ఞాతవాసి" నెక్ట్స్ సింగిల్ ‘గాలి వాలుగ..’ రిలీజ్ డేట్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించారు. ఇటీవల ‘బయటికొచ్చి చూస్తే టైమేమో..’ సాంగ్ రిలీజై అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. నెక్ట్స్ సింగిల్ ‘గాలి వాలుగ..’ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించేసింది. ఈ సాంగ్ ఈనెల 12న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. పవన్ స్టైల్‌గా నిలబడి పాట పాడుతున్నట్టుగా కనిపిస్తున్న స్టిల్ అదరగొట్టేస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top