మెగాస్టార్ వ‌య‌సు 102 ఏళ్ళు నాటౌట్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ వ‌య‌సు 74 ఏళ్ళు అయిన‌ప్ప‌టికి ప‌నిలో మాత్రం 20 ఏళ్ళ వ్య‌క్తి చూపించే ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. ఇటీవ‌ల స‌ర్కార్ 3 చిత్రంతో అల‌రించిన బిగ్ బీ ప్ర‌స్తుతం 102 నాటౌట్ అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో అమితాబ్ 102 ఏళ్ళ వ‌య‌స్సున్న వ్య‌క్తిగా క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న త‌న‌యుడిగా రిషి కపూర్ న‌టిస్తున్నారు.

ఉమేశ్ శుక్లా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ముంబై పరిస‌ర ప్రాంతాల‌లో షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, తండ్రి కొడుకులు నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ మూవీలో ఇద్ద‌రు స్టార్ హీరోలు గుజ‌రాతీలుగా క‌నిపించ‌నున్నారు.

26 ఏళ్ళ త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టించ‌డం విశేషం. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ పిక్ ని షేర్ చేసింది మూవీ టీం. మే 17న మొద‌లైన ఈ చిత్ర షూటింగ్ ఈ నెల‌ఖ‌రు వ‌ర‌కు ముంబైలో జ‌ర‌గ‌నుంద‌ని , త‌ర్వాతి షెడ్యూల్ జూలైలో ప్రారంభం కానుంద‌ని అంటున్నారు. అయితే రిషి క‌పూర్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ లో అమితాబ్ తో మ‌రోసారి స్క్రీన్ షేర్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంద‌నే విష‌యాన్ని తెలుపుతూ ఓ ఫోటోని షేర్ చేశాడు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top