సినీ నటి రోజా దృష్టికి అక్రమ సంబంధం..

వైవాహిక సంబంధాలు, సంసారంలో కలతలు, కన్నీళ్లు, విభేదాలు ఇప్పుడు టెలివిజన్ చానెళ్లకు మంచి రేటింగ్‌ను సంపాదించిపెడుతున్నాయి. ఈ అంశాలను ఆధారంగా చేసుకొని పలువురు సినీ తారలు ప్రత్యేకమైన కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే టీఆర్పీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారనే విమర్శకలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ నటి రోజా నిర్వహించే రచ్చబండ కార్యక్రమంపై ఇటీవల అక్రమ సంబంధం కేసు చర్చ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విజయనగరానికి చెందిన ఓ మహిళ కన్నీటి కథను రంజుగా మొదలుపెట్టారు. 15 ఏళ్లపాటు చక్కగా సంసారంలో ఇటీవల కొన్ని కలతలు చేటుచేసుకొన్నాయట. అందుకు కారణం సదరు మహిళ భర్త మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆ వివాదానికి మూల బిందువు. పద్దతి మార్చుకోవాలని సూచిస్తే తన భర్త దౌర్జన్యం చేస్తున్నాడనీ ఆవేదన వ్యక్తం చేసింది.

తన భర్తను మరో మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా చూశానని ఆమె అంటోంది. దీనిపై రోజా చర్చను చేపట్టారు. ఈ అంశం ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆలుమగల సమస్యను రోజా ఎలా పరిష్కరిస్తారో చూద్దామనే ఆసక్తి టీవీ వీక్షకులపై రేకెత్తిస్తున్నది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top