బాహుబలి-2,దంగల్ రికార్డు బ్రేక్ చేసిన "అజ్ఞతవాసి"

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ చిత్రం బాహుబలి 2, దంగల్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసి ట్రెండ్ సెట్టర్ అయింది. విడుదల తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు కానీ, ఇప్పుడు ఎక్కడ చూసినా ‘అజ్ఞాతవాసి’ హవానే నడుస్తుంది. విడుదలకు ఇంకా నెల రోజులు టైమ్ ఉంది. అయినా కూడా ‘అజ్ఞాతవాసి’ని ఆపడం ఎవరితరం కావడం లేదు.

ఇక విషయంలోకి వస్తే ఈ సినిమా జనవరి 9వ తేదీని అమెరికాలో రికార్డ్ సృష్టించబోతుంది. ఇప్పటి వరకు అమెరికా సినీ మార్క్‌లో ఇప్పటి వరకు ఏ మూవీ విడుదలకానన్ని లోకేషన్స్‌లో విడుదలవుతూ రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. అమెరికా సినీ మార్క్‌లో ఈ చిత్రం 209 లోకేషన్స్‌లో రిలీజవుబోతున్నట్లుగా ఓవర్సీస్ డిస్టిబ్యూటర్స్ అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు ‘బాహుబలి 2’ చిత్రం అన్ని భాషలు కలిపి 126 లోకేషన్స్‌లో విడుదలై రికార్డ్‌ని క్రియేట్ చేసింది. బాహుబలి 2 తర్వాత స్థానంలో చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం 74 లోకేషన్స్, ‘కబాలి’ చిత్రం 73 లోకేషన్స్, ‘దంగల్’ చిత్రం 69 లోకేషన్స్‌లో విడుదలయ్యాయి. తొలిసారి 209 లోకేషన్స్‌లో విడుదలవుతూ ‘అజ్ఞాతవాసి’ అందరికీ షాక్ ఇచ్చాడు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top