లాభాలో ఉన్న మార్కెట్ మల్లి నష్టాల్లోకి

ముంబయి: దేశీయ సూచీలు నేడు వూగిసలాడుతున్నాయి. మంగళవారం ఉదయం కాస్త కోలుకున్నట్టు కనిపించిన సూచీలు వెంటనే నష్టాల బాట పట్టాయి. సోమవారం 281 పాయింట్లు కోల్పోయి 33,033.56 వద్ద స్థిరపడిన సెన్సెక్స్‌ నేడు 32,990 వద్ద ప్రారంభమైంది. 33,126.56 పాయింట్ల ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకి మెల్లగా నష్టాల్లోకి జారుకుంది. ఉదయం పది గంటల సమయంలో 33,043 పాయింట్ల వద్ద కదలాడుతోంది. సోమవారం 96.80 పాయింట్లు తగ్గి 10,224.95 వద్ద ముగిసిన నిఫ్టీ ఈ రోజు ఉదయం 10,223.40 వద్ద ప్రారంభమైంది. 10,248.40 పాయింట్లను తాకి ప్రస్తుతం 10,219 వద్ద ఫ్లాట్‌గా కదలాడుతోంది.

నిరాశజనకంగానే

ఆయా కంపెనీల ఫలితాలు, అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాలు, చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, దేశీయ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్భణం గణాంకాలు, ముడిచమురు ధరల నేపథ్యంలో మార్కెట్లు వూగిసలాటలో ఉన్నాయి. సంస్థల ఫలితాలు నిరాశాజనకంగా కనిపిస్తున్నాయి. నిఫ్టీలో ఎన్‌టీపీసీ, రిలయన్స్‌, యూపీఎల్‌, లుపిన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభాల్లో ఉండగా ఇన్ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, ఐవోసీ, టీసీఎస్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top