32వేలకు చేరువలో సెన్సెక్స్‌

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ సూచీలు నేడు లాభాల్లో పయనించాయి. అటు హెల్త్‌కేర్‌, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు పుంజుకోవడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చింది. అయితే చివర్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురైనప్పటికీ లాభాలను నిలబెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ మళ్లీ 32వేలకు చేరువగా.. నిఫ్టీ 10వేల మైలురాయిని దాటింది. ఈ ఉదయం 80 పాయింట్లకు పైగా లాభంతో 31,930 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా లాభాల్లోనే సాగింది. చివర్లో కాస్త వూగిసలాడినప్పటికీ 77 పాయింట్ల లాభంతో 31,924 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా నేడు 10వేల బెంచ్‌మార్క్‌ను దాటింది. 28 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ 10,017 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.65.24గా కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో యూపీఎల్‌ లిమిటెడ్‌, లుపిన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఐషర్‌ మోటార్స్‌, వేదాంత లిమిటెడ్‌, హిందుస్థాన్‌ యూనిలివర్‌, అంబుజా సిమెంట్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top