తగిన రెడీమి నోట్ -4 ధర

షావోమికి చెందిన హాట్‌కేకులా అమ్ముడుపోతున్న రెడ్‌మి నోట్‌ 4 ధర శాశ్వతంగా తగ్గింది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను వెయ్యి రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రెడ్‌ నోట్‌4 ధర భారత్‌లో రూ.9999 నుంచి ప్రారంభమవుతోంది. ఈ విషయాన్ని షావోమి ఇండియా అదినేత మను కుమార్‌ జైన్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. '' భారత్‌లో నెంబర్‌ 1 అమ్మకపు స్మార్ట్‌ఫోన్‌గా ఉన్న రెడ్‌మి నోట్‌ 4 ధరను శాశ్వతంగా తగ్గిస్తున్నట్టు మేము ప్రకటిస్తున్నాం'' అని జైన్‌ ట్వీట్‌ చేశారు. రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ధర తగ్గింపు అనంతరం 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 9,999 రూపాయలు కాగ, 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఆన్‌బోర్డు స్టోరేజ్‌ ధర 11,999 రూపాయలు. ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌ రెండింట్లోనూ ఈ ధర తగ్గింపు ఉండనుంది. ఈ ధర తగ్గింపుతో మోటో జీ5, నోకియా 5, శాంసంగ్‌ గెలాక్సీ జే7 మోడల్స్‌కు ఇది గట్టి పోటీగా నిలువనుంది.

ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లు..

ఈ ధర తగ్గింపుకు అదనంగా, పాత మోడల్స్‌ను ఎక్స్చేంజ్‌ చేసి దీన్ని కొనుగోలు చేస్తే రూ.11,000 తగ్గింపు లభించనుంది. యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లను ఇది అందుబాటులోకి తీసుకొచ్చింది.

రెడ్‌మి నోట్‌ 4 స్పెషిఫికేషన్లు..

5.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే

2.5 కర్వ్‌డ్‌ గ్లాస్‌

ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీ

128జీబీ వరకు విస్తరణ మెమరీ

13 ఎంపీ బ్యాక్‌ కెమెరా

5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ

బ్లాక్‌, డార్క్‌ గ్రే, గోల్డ్‌ రంగుల్లో ఇది అందుబాటు

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top