గోద్రేజ్ ఏసీలు ,రిఫ్రిజిరేటర్ల ధర పెరగనుంది,

ప్రముఖ వస్తూత్పత్తి సంస్థ గోద్రేజ్‌ రిఫ్రిజిరేటర్లు, ఏసీల ధరలను పెంచనుంది. తయారీ ఖర్చు పెరగడంతో ఈ ధరలను కూడా 3 నుంచి 6శాతం పెంచే యోచనలో ఉంది. ‘తయారీ వస్తువుల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. దీంతో ధరల్లోనూ మార్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. ధరలను పెంచాలని ఆలోచిస్తున్నాం. నవంబర్‌, డిసెంబర్‌లలో ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు 3 నుంచి 6శాతం పెరుగుతాయి’ అని గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది అన్నారు. రా మెటీరియల్‌ ధరలను బట్టి ఈ ధరల పెంపు ఉంటుందని చెప్పారు.

ఈ ఏడాది జనవరి నుంచి స్టీల్‌ ధర 10-15శాతం, ప్లాస్టిక్స్‌ 6-7శాతం, రాగి ధర 40-50శాతం పెరిగింది. ఇక దీంతోపాటు జీఎస్‌టీ తర్వాత ఏసీ, ఫ్రిజ్‌లపై పన్నులు కూడా పెరిగిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఏసీలు, ఫ్రిజ్‌లపై 23-25శాతం పన్ను ఉండగా.. ప్రస్తుతం ఇవి 28శాతం జీఎస్‌టీ శ్లాబులో ఉన్నాయి. అయితే వరుసగా పండగ సీజన్‌ రావడంతో జులై నుంచి ధరలు పెంచలేదని గోద్రేజ్‌ పేర్కొంది. ఇప్పుడు నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరల పెంపు గురించి యోచిస్తున్నామని తెలిపింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top