పీఎన్‌బీ పండుగ శుభవార్త!

ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. రానున్న దసరా దీపావళి సందర్భంగా కస్టర్లకు రుణాలపై తక్కువ వడ్డీరేట్ల ఆఫర్‌ను ప్రకటించింది. రుణాల వడ్డీరేటులో (ఎంసీఎల్‌ఆర్‌) కోత పెట్టింది. 20-25 బేసిస్‌పాయింట్లను తగ్గిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. ఈ తగ్గింపురేట్లు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది.

తాజా నిర్ణయం ప్రకారం పీఎన్‌బీ ప్రస్తుత బేస్ వడ్డీరేటు 9.15శాతంగా ఉండనుంది. ఇప్పటివరకు ఇది 9.35 శాతం. వార్షిక ఎంసీఎల్‌ఆర్‌ 8.15 శాతంగాను, మూడు నెలల కాలానికి 8 శాతంగా ఉంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top