పెట్రోల్‌పై పన్నులు తగ్గించం: అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ పెట్టుబడులను పెంచేందుకు ఎక్సైజ్ సుంకం రూపంలో వచ్చే ఆదాయం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఏ రాష్ట్రమైనా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని భావిస్తే, తగ్గించుకోవచ్చన్నారు. ఇంధనంపై రాష్ర్టాల పన్నుల వాటానే అధికంగా ఉందన్నారు.

నవంబర్ 2014 నుంచి జనవరి 2016మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం.. ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్‌పై రూ.11.77, డీజిల్‌పై రూ.13.47 మేర పెంచిన విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఈమధ్యకాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగటం వల్లే దేశీయంగానూ ఇంధన రేట్లు పెరిగాయని బుధవారం క్యాబినెట్ భేటీ నిర్ణయాలను తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. వరుస తుఫాన్ల ధాటికి అమెరికా అతలాకుతలం కావడమే ఇందుకు కారణమన్నారు. మున్ముందు ధరలు కొంత తగ్గుముఖం పట్టవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

వృద్ధికి ఊతమిచ్చేందుకు మరిన్ని చర్యలు

దేశ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు కేంద్రం అదనపు చర్యలు చేపట్టనుందని జైట్లీ తెలిపారు. అయితే, ప్రధాని మోదీని సంప్రదించాక వాటిని ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. వరుసగా ఆరు త్రైమాసికాలుగా తగ్గుకుంటూ వస్తున్న వృద్ధిరేటు ఏప్రిల్ జూన్ మధ్యకాలానికి 5.7 శాతానికి క్షీణించింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top