ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్లు అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే లోయర్ లెవెల్స్‌లో కొనుగోళ్ల మద్దతు లభించింది. తిరిగి ప్రాఫిట్ బుకింగ్ కారణంగా చివరికి సెన్సెక్స్‌ 7 పాయింట్ల లాభంతో 29,933 నిఫ్టీ 3 పాయింట్లు లాభపడి 9,316.85 దగ్గర క్లోజ్ అయింది.

ముఖ్యంగా ఇటీవల భారీగా ర్యాలీ అయిన సిమెంట్‌ షేర్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపించింది. బ్యాంక్‌ ఇండెక్స్ కూడా నష్టపోయింది. గోద్రెజ్‌ కన్జ్యూమర్స్‌ టాప్‌ విన్నర్‌గా నిలిచింది. క్యూ 4 ఫలితాల అంచనాలతో భారతి ఎయిర్‌ టెల్‌ భారీగా నష్టపోయింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌, కెనరా బ్యాంక్‌ తదితర షేర్లు నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top