ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్‌ వీక్‌

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ యాపిల్‌ వీక్‌ పేరుతో యాపిల్‌ ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు జనవరి 15 వరకు కొనసాగుతాయని సంస్థ వెల్లడించింది. యాపిల్‌ ఉత్పత్తులైన ఐఫోన్లు, మ్యాక్‌బుక్‌ ఎయిర్‌, ఐపాడ్‌, ఐపాడ్‌ ప్రో, యాపిల్‌ వాచ్‌ లోని 1, 2, 3 సిరీస్‌లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన వారికి దాదాపు రూ.8 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌ యాపిల్‌ వీక్‌లో భాగంగా ఐఫోన్‌ 7 ప్లస్‌ (32జీబీ) రూ.56,900, ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ (32జీబీ) పై దాదాపు రూ.11వేలు తగ్గి రూ. 37,999కి లభించనుంది. అదే విధంగా ఐఫోన్‌ 7 (32జీబీ) రూ. 42,999, ఐఫోన్‌ 6 (32జీబీ) రూ. 25,499, ఐఫోన్‌ ఎస్‌ఈ (32జీబీ) రూ. 18,999, ఐఫోన్‌ 8 (64జీబీ) రూ.9వేలు తగ్గి 54,999కు, ఐఫోన్‌ 8 ప్లస్‌ (64జీబీ) రూ. 66,499కి లభిస్తున్నాయి. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్‌తో ఈఎంఐ పద్ధతితో కొనుగోలు చేసే ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ 8, ఐఫోన్ 8 ప్లస్‌పై రూ.8 వేలు, ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌పై రూ. 5 వేలు, ఐఫోన్‌ 6, 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌పై రూ.3 వేలు క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top