ఎం చేసిన ఇండిగో ప్రవర్తన మాత్రం మారటంలేదు

ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించొద్దు, వారిని గౌరవించండి అంటూ ఇటీవల ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు పార్లమెంటరీ స్థాయీ సంఘం చివాట్లు పెట్టిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఇండిగో సిబ్బంది తమపట్ల దురుసుగా ప్రవర్తించారంటూ ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. డిసెంబరు 30న జరిగిన ఈ ఘటన అతడి పోస్టు ద్వారా వెలుగులోకి వచ్చింది.

‘విమానం దిగండి. లేదంటే భద్రతా సిబ్బందిని పిలిపించి ప్రయాణికులను బలవంతంగా బయటకు లాగిపడేస్తాం’ అని ఇండిగో సిబ్బంది బెదిరింపులకు పాల్పడినట్లు మహారాష్ట్రకు చెందిన ప్రసాద్‌ నందూర్‌కర్‌ అనే వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘తొలుత విమానం బోర్డింగ్‌కు అంగీకరించారు.. అనంతరం ఉన్నట్టుండి విమానాన్ని రద్దు చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే విమానం నుంచి దిగకపోతే గెంటేయాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు’ అని ప్రసాద్‌ తన పోస్టులో పేర్కొన్నారు. పట్నా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.

దీనిపై ఇండిగో స్పందించింది. విమానంలో 20 మంది ప్రయాణికులు మినహా అందరూ విమానం దిగారు. వాళ్లకి విమానం దిగమని చాలా మర్యాదగా చెప్పామని ఇండిగో చెప్పుకొస్తుంది. ‘కోల్‌కతా-పట్నా-లఖ్‌నవూ ఇండిగో 6ఈ-633 విమానం పట్నా ఎయిర్‌పోర్టులో రాత్రి 8.20కి బయలుదేరాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విమానాన్ని రద్దు చేశాం. ప్రయాణికులకు బస ఏర్పాటు చేశాం. కానీ 20 మంది ప్రయాణికులు విమానం దిగేందుకు ఇష్టపడలేదు. సిబ్బంది చాలా గౌరవంగా చెప్పినప్పటికీ వాళ్లు వినలేదు’ అని ఇండిగో తన ప్రకటనలో పేర్కొంది.

ఇటీవల ఇండిగో సిబ్బంది ఓ ప్రయాణికుడిపై చేయి చేసుకున్న ఘటనపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విమానయాన సంస్థలు ప్రయాణికుల పట్ల స్నేహపూర్వకంగా ఉండాలని.. సిబ్బంది ప్లీజ్‌, థాంక్యూ చెప్పడం నేర్చుకోవాలని సూచించింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top