న్యూయార్క్‌ నుంచి లండన్‌కు విమానం ప్రయాణం 3 గంటల్లో

2025 నాటికి న్యూయార్క్‌ నుంచి లండన్‌కు విమానం ప్రయాణం 3 గంటల్లో వెళ్లవచ్చు. ఈ దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు న్యూయార్క్‌ నుంచి లండన్‌కు విమానం మార్గం ద్వారా 7 గంటలకు పైగా సమయం పడుతోంది. బూమ్‌ సూపర్‌ సోనిక్‌ అనే సంస్థ సూపర్‌ సోనిక్‌ జెట్‌ విమానాన్ని తయారుచేస్తోంది. వచ్చే ఏడాది చివరినాటికి ఈ విమానాన్ని పరీక్షించనున్నారు.

జపాన్‌ కూడా 20 సూపర్‌సోనిక్‌ విమానాలను కొనుగోలు చేసేందుకు బూమ్‌ సూపర్‌సోనిక్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ విమానంలో ప్రయాణించేందకు ధర 2,500 డాలర్లు ఉండనుంది. ఈ విమానంలో మొత్తం 45–55 సీట్లు ఉంటాయని బూమ్‌ సంస్థ ప్రకటించింది. అయితే ఈ విమానం గంటకు దాదాపు 1451 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ విమానం అందుబాటులోకి వస్తే న్యూయార్క్‌–లండన్‌ ప్రయాణం దాదాపు 3 గంటలు తగ్గనుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top